اردو میں پڑھیںRead in Englishజిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తికై పది రోజులు ప్రత్యేక డ్రైవ్ :జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి, Siddipet News | ప్రాంతీయం
Download Siddipet News Android App: Click Here

జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తికై పది రోజులు ప్రత్యేక డ్రైవ్ :జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి

జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తికై పది రోజులు ప్రత్యేక డ్రైవ్ :జిల్లా కలెక్టర్ శ్రీ పి. వెంకట్రామ రెడ్డి


జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికై పది రోజులు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ప్రాధాన్య క్రమంలో ప్రణాళికా బద్ధంగా అర్బన్ ప్రాంత మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపేలా ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. 
సాధ్యమైనంత త్వరగా జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సిద్ధిపేట ఐడీఓసీ కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో బుధవారం జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పై అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్లు, డీఏంహెచ్ఓ మనోహర్, వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ముందస్తు సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీలతో సహా అన్నీ మండలాలలో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు 7 , 13,312 మంది ఉండగా వీరిలో 5,56,283 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ 78 శాతం వరకూ జరిగిందని, రెండవ డోస్ వ్యాక్సినేషన్ 2, 23, 853 మంది వరకూ 40 శాతం వ్యాక్సినేషన్ చేయించుకున్నారని, మిగిలిన మొదటి డోస్ కూడా వేసుకోని వారు 1 లక్షా 57 వేల 029 మంది వరకూ దాదాపు 22 శాతం ఉంటారని, రెండో డోస్ నిర్ణీత గడువు ముగిసినా, ఇంకా రెండో డోస్ తీసుకొని వారు జిల్లాలో 1 లక్షా 14 వేల 322 మంది ఉన్నట్లు, ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ తీసుకోని, రెండో డోస్ పూర్తయి నిర్ణీత గడువు ముగిసినా ముందుకు రాని వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టి వంద శాతం వ్యాక్సినేషన్ చేసిన జిల్లాగా సిద్ధిపేటను ఆదర్శంగా నిలుపుదామని జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. 
రేపటి నుంచి పది మంది అధికారులతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మూడు రకాల జాబితాలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల వద్ద సమగ్ర సమాచారం ఉంటుందని, ప్రతీ గ్రామంలో వ్యాక్సినేషన్ తీసుకోని వారిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో అంగన్ వాడి కార్యకర్తలు, VRA లు, రేషన్ డీలర్ లు, ఆశా కార్యకర్తలు, పంచాయితీ సెక్రటరీల తో కూడిన గ్రామ స్థాయి బృందాలు వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి సంపూర్ణంగా జరిగేలా చూడాలని సూచించారు. 
జిల్లాలోని 499 గ్రామ పంచాయతీలకు గానూ ప్రతీ అధికారికి 50 గ్రామాలు కేటాయింపు చేసినట్లు, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ వారే ఆ గ్రామాలకు బాధ్యులుగా ఉంటారని, రానున్న 10 రోజుల్లో 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని కలెక్టర్ ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. 
వ్యాక్సినేషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ కాని వారిని గుర్తించి వారి రిజిస్ట్రేషన్ చేపట్టేలా ప్రత్యేక శ్రద్ద పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేసుకోని వారి జాబితా రూపొందించి ప్రతీగ్రామ ఆశా కార్యకర్తలు, వీఆర్ఏలు, అంగన్ వాడీ, ప్రత్యేక అధికారుల సమన్వయంతో గ్రామంలో వార్డు వారీగా క్యాంపులు పెట్టుకుని కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 
ఈ మేరకు దుబ్బాక, మిరుదొడ్డి మండలాలకు డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, సిద్ధిపేట మున్సిపాలిటీకి కమిషనర్ రమణాచారి, ములుగు, వర్గల్, మర్కుక్ మండలాలకు ఏపీడీ కౌసల్య, సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, నారాయణరావు పేట మండలాలలకు డాక్టర్ కాశీనాథ్, కొమురవెళ్లి, చేర్యాల మండలాలకు పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి సత్యపాల్, బెజ్జంకి, కోహెడ మండలాలకు ప్రత్యేక అధికారి ఓబులేష్, హుస్నాబాద్, అక్కన్నపేట, మద్దూర్, దూల్మిట్ట మండలాలకు హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, దౌల్తాబాద్, రాయపోల్, తొగుట మండలాలకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, కొండాపాక మండలానికి జిల్లా శిక్షణ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, చిన్నకోడూర్, నంగునూరు మండలాలకు జెడ్పీ సీఈఓ రమేశ్, గజ్వేల్ మున్సిపాలిటీకి కమిషనర్ వెంకట గోపాల్ లను నియమిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు ప్రాధాన్య క్రమంలో వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చొరవ చూపాలని, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వారికి వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు
ప్రాంతీయం
SELECT * FROM newsdescription where activity_type='2' order by id desc limit 0,19