اردو میں پڑھیںRead in Englishపోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ, Siddipet News | ప్రాంతీయం
Download Siddipet News Android App: Click Here

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ చౌరస్తా నుండి నాగ దేవత టెంపుల్ చౌరస్తా, వరుస సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. సైకిల్ ర్యాలీలో పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్ గారు, సిద్దిపేట ఏసిపి దేవా రెడ్డి, టూ టౌన్ సిఐ పరశురామ్ గౌడ్, ఎస్బి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, మరియు సిద్దిపేట యువకులు, వివిధ స్కూల్లో విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అమరవీరుల ఆశయం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే సందర్భంగా రక్తదాన శిబిరాలు, విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ ఎస్సే రైటింగ్, పోలీస్ రిలేటెడ్ షార్ట్ ఫిలిమ్స్,  ఆఫ్ మారథాన్  రన్నింగ్ పోటీలు, ఆన్లైన్ ఓపెన్ హౌస్ మరియు వివిధ కార్యక్రమాలు  నిర్వహించడం జరిగింది. ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. 
పోలీసులు విధి  నిర్వహణలో భాగంగా ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా సంఘ విద్రోహక శక్తులను ఎదుర్కొన్న పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. పేద ప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్  రోజా రాధాకృష్ణ శర్మ గారు మాట్లాడుతూ

పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందని, పోలీసులు విధి నిర్వహణలో రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతున్నారని ఆ సమయంలోనే అమరులైన పోలీసులకు నివాళులర్పించడం మనందరి బాధ్యత తెలిపారు. పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని మహిళల రక్షణ గురించి రాష్ట్రంలో జిల్లాలో షిటీమ్స్ భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి యొక్క సమస్యలు చెప్పుకొని సహాయం పొందుతున్నారని తెలిపారు. డయల్ 100 ద్వారా ఏదైనా సంఘటన జరిగితే ఐదు నుంచి పది నిమిషాల లోపు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసులకు అత్యాధునిక వాహనాలు మరియు నూతన టెక్నాలజీ సమకూర్చడం జరిగిందన్నారు. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న యువకులు విద్యార్థులను అభినందించారు. పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో పోలీసులు  ధనిక, పేద, కుల, మత వర్గాల తేడా లేకుండా ప్రజలతో మమేకమై సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, మరియు ప్రజలకు సత్వర న్యాయం అందిస్తున్నారని పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడి పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు.

సైకిల్ ర్యాలీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది

జిల్లా పరిషత్ చైర్ పర్సన్, పోలీస్ కమిషనర్, సిద్దిపేట ఏసిపి గార్లు కలసి  విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

1.తరుణ్, బిటెక్ స్టూడెంట్ హుస్నాబాద్, (మొదటి బహుమతి పొందారు
2. మహమ్మద్ హబీబ్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, సిద్దిపేట పట్టణం (రెండవ బహుమతి పొందారు.)
3. ఉదయ్, డిగ్రీ స్టూడెంట్, హుస్నాబాద్ (మూడవ బహుమతి పొందారు).
 
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజశేఖర్, ట్రాఫిక్ ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది మరియు ప్రభుత్వ, ప్రైవేటు  పిఈటి టీచర్లు, వివిధ పాఠశాల విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు
ప్రాంతీయం
SELECT * FROM newsdescription where activity_type='2' order by id desc limit 0,19