اردو میں پڑھیںRead in Englishమీరు Private Job చేస్తున్నా...నెల నెల పెన్షన్ పొందాలంటే, Siddipet News | ఉపయోగపడే సమాచారం
Download Siddipet News Android App: Click Here

మీరు Private Job చేస్తున్నా...నెల నెల పెన్షన్ పొందాలంటే

మీరు Private Job చేస్తున్నా...నెల నెల పెన్షన్ పొందాలంటే

ఇటీవలి కాలంలో పెన్షన్ స్కీమ్స్​లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే చాలా మంది ప్లాన్​ చేసుకుంటున్నారు. రిటైరయ్యాక ప్రతి నెలా డబ్బు వచ్చేలా పెన్షన్ స్కీమ్​లవైపు చూస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ పథకం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కీమ్​లో చేరితో తక్కువ మొత్తం కడుతూనే 60 ఏళ్ల తర్వాత ప్రతీనెలా ఫిక్స్​డ్​ పెన్షన్ పొందవచ్చు. ఆ పథకం పేరే అటల్ పెన్షన్ యోజన (ఏపీఐ). ఈ పథకం ద్వారా భారత పౌరులందరికీ 60 ఏళ్ల వయసు తర్వాత ప్రతీనెల రాబడి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (పీఎఫ్​ఆర్​డీఏ) నియంత్రణలో ఈ అటల్ పెన్షన్ యోజన పథకం ఉంటుంది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ స్కీమ్​లో ఉపయోగపడుతుంది. అలాగే జాతీయ పెన్షన్​ స్కీమ్ (ఎన్​పీఎస్) కింద ఉన్న పథకంలో చేరి రోజుకు రూ.7 చెల్లించడం ద్వారా 60 ఏండ్ల తర్వాత రూ.5వేల వరకు పెన్షన్ పొందవచ్చు
 

బ్యాంకు అకౌంట్ ఉండి.. 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న భారత పౌరులందరూ అటల్ పెన్షన్ యోజనకు అర్హులు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆధార్​ లింక్​ అయి ఉన్న సేవింగ్స్​ అకౌంట్ ఉండాలి. ఈ పథకం కింద ఉన్న వారు బ్యాంకు ఖాతాలో 20ఏళ్ల పాటు డబ్బు జమ చేయాలి.


అటల్ పెన్షన్ యోజన వివరాలు:
18 ఏళ్ల వయసు ఉన్న వారు ప్రస్తుతం ఈ స్కీమ్​లో చేరితే నెలకు రూ.210 చెల్లించాలి. అంటే రోజుకు 7 రూపాయలు అన్నమాట. ఈ పథకంలో చేరితే ఈ మొత్తం నెలకు ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్​గా కట్ అవుతుంది. ఇంత మొత్తం ప్రతీనెలా చెల్లిస్తే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి నెలా

రూ.5వేల వరకు పెన్షన్
అయితే తక్కువ పెన్షన్ చాలనుకుంటే ఇప్పుడు తక్కువ మొత్తం కూడా చెల్లించవచ్చు. ఆ స్కీమ్ కింద ఇప్పుటి నుంచి నెలకు రూ.42 కడితే 60 ఏండ్ల వయసు తర్వాత రూ.1000 పెన్షన్ వస్తుంది. అదేవిధంగా నెలకు రూ.84 కడితే రూ.2,000, రూ.126 కడితే రూ.3,000, రూ.168 కడితే రూ.4,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకానికి నామినేషన్ పద్ధతి కూడా ఉంది. ఒకవేళ ఈ పథకంలో ఉన్న వారు దురదృష్టవశాత్తు చనిపోతే నామినేషన్​ ఎవరి పేరు ఉంటే వారికి లబ్ధి చేకూరుతుంది. నామినేట్​గా ఉన్న వ్యక్తి బ్యాంకులు వెళ్లి డిపాజిట్ మొత్తాన్ని, పెన్షన్ లాభాలను పొందవచ్చు.

మరిన్ని వార్తలు
ఉపయోగపడే సమాచారం
SELECT * FROM newsdescription where activity_type='17' order by id desc limit 0,19