اردو میں پڑھیںRead in Englishతెలుగు భాషను మనమే కాపాడుకోవాలి - వేలేటి మృత్యృంజయశర్మ, Siddipet News | సాహిత్యం
Download Siddipet News Android App: Click Here

తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి - వేలేటి మృత్యృంజయశర్మ

తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి - వేలేటి మృత్యృంజయశర్మ

తెలుగు భాషా పరిశోధన కేంద్రం మరియు రాంపూర్ యువజన కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రేస్ క్లబ్ లో జరిగిన తెలుగు సాహితీ పురస్కార సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త వేలేటి మృత్యృంజయశర్మ  మాట్లాడుతూ రామాలయ నిర్మాణం గొప్ప విషయమని, ఎందరో మహానీయుల కృషి ఫలించనుందన్నారు. తెలుగు భాషను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరికీ వుందన్నారు. భాషా పరిశోధకులు జరగాలన్నారు.  రాంపూర్ యువజన కమిటీ సమాజ సేవతో అమరావతి వరకు వెళ్ళడంలో ఎంతో కృషి ఉందన్నారు. రాష్ట్ర మీడియా అకాడమీ సభ్యులు కె.అంజయ్య మాట్లాడుతూ సంకల్పం వుంటే ఎదైనా సాధించవచ్చునని, ఆలోచన, ఆశయంతో ముందుకు వెళ్ళాలన్నారు.

సామాజిక ప్రయోజనానికి సాహిత్యం ఎంతో అవసరం. విస్తృతమైన సాహిత్యం ఎంతో అవసరమన్నారు. టిపియస్సియఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాగిచెట్టు మహేష్ మాట్లాడుతూ బాష, సంస్కృతి సమాజంలో ఒకటంటూ, సేవా తత్వాన్ని కలిగిన వారు గొప్పవారన్నారు. మరసం అధ్యక్షులు కె.రంగాచారి మాట్లాడుతూ రాంపూర్ నుంచి ఒక చిన్న ఎన్జీవో సంస్థ ఇలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషమన్నారు.  సమాజంలో ఎన్జీవో సంస్థల పాత్ర అవసరమన్నారు. సభాద్యక్షులు ఎలగందుల నితిన్ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాషా పరిశోధన కేంద్రం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు.

జాతీయ స్థాయి కవితా పోటీలలో ఎంపికైన మాడుగుల మురళీధరశర్మ, రాజశేఖర శర్మ, బైతి దుర్గయ్య, బోపెన వెంకటేష్, త్రివిక్రమశర్మ కవులతో పాటు జిల్లాలోని  కవులు ఐతా చంద్రయ్య, అనాజిపూర్ కిషన్, మైముద్ పాషా, తలారి మైపాల్, తోట అశోక్ లను సత్కరించారు.  కార్యక్రమంలో కవులు రాజమౌళి, కొండి మల్లారెడ్డి, పోన్నాల బాలయ్య, నరసింహారెడ్డి, ఉండ్రాళ్ళ రాజేశం, మరియు ఆర్.వై.సి అధ్యక్షులు గోవిందారం సంతోష్ , కార్యదర్శి నిఖిల్ శర్మ , అశోక్ , రసూల్ , రాజు , దిలీప్ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు
సాహిత్యం
SELECT * FROM newsdescription where activity_type='18' order by id desc limit 0,19