اردو میں پڑھیںRead in English2 లక్షలకుపైగా పార్టీ సభ్యత్వాలు -టీఆర్‌ఎస్‌ పార్టీ, జిల్లా రథసారధి ఎవరో ? వచ్చే నెలలోనే కమిటీలు, Siddipet News | రాజకీయం
Download Siddipet News Android App: Click Here

2 లక్షలకుపైగా పార్టీ సభ్యత్వాలు -టీఆర్‌ఎస్‌ పార్టీ, జిల్లా రథసారధి ఎవరో ? వచ్చే నెలలోనే కమిటీలు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో సుమారు 2 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. 50వేల మంది క్రియాశీలక సభ్యులు. గ్రామగ్రామాన పార్టీ బలంగా ఉన్నది. నాయకుల సంఖ్యకు కూడా కొదవ లేదు. జిల్లా వ్యాప్తంగా 499 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలుండగా, ప్రతి గ్రామంలో పది మందికి పైగా ముఖ్య నాయకులున్నారు. ఐదు మున్సిపాలిటీల్లోని 115 వార్డుల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువ. ఇప్పుడు ప్రతివార్డులో, గ్రామపంచాయతీల పరిధిలో కమిటీల నియామకం జరగాల్సి ఉన్నది.

కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత పార్టీ పదవులకు నోచని టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మండల స్థాయిలో కార్యవర్గాలతో పాటు అనుబంధ విభాగాలకూ కమిటీలను నియమించాల్సి ఉంది. పార్టీ కమిటీల ఏర్పాటుపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటన చేయడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.  

2 లక్షలకుపైగా పార్టీ సభ్యత్వాలు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో సుమారు 2 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. 50వేల మంది క్రియాశీలక సభ్యులు. గ్రామగ్రామాన పార్టీ బలంగా ఉన్నది. నాయకుల సంఖ్యకు కూడా కొదవ లేదు. జిల్లా వ్యాప్తంగా 499 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలుండగా, ప్రతి గ్రామంలో పది మందికి పైగా ముఖ్య నాయకులున్నారు. ఐదు మున్సిపాలిటీల్లోని 115 వార్డుల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువ. ఇప్పుడు ప్రతివార్డులో, గ్రామపంచాయతీల పరిధిలో కమిటీల నియామకం జరగాల్సి ఉన్నది.

జిల్లా రథసారధి ఎవరో ?

కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించలేదు. కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయలేదు. అవసరం మేరకు కమిటీలు ఏర్పడ్డాయే కానీ, పూర్తిస్థాయిలో నియామకం జరగలేదు. తాజాగా సీఎం ప్రకటనతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి మొదలైంది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు సంబంధించిన జిల్లా కావడంతో సాధరణంగానే ప్రాధాన్యం నెలకొన్నదది.

వచ్చే నెలలోనే కమిటీలు

నవంబర్‌లో పార్టీ ద్విదశాబ్ది వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అంతకుముందే.. అంటే సెప్టెంబర్‌లోనే కమిటీల ఏర్పాటు పూర్తి కావాలనేది పార్టీ లక్ష్యంగా తెలుస్తున్నది. పార్టీ కమిటీలతో పాటు యువజన, విద్యార్థి, కార్మిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా విభాగాలకు కూడా కార్యవర్గాలను నియమిస్తారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడినవారు పార్టీ పదవులు దక్కుతాయన్న ఆశావహ దృక్పథంతో ఉన్నారు. 

మరిన్ని వార్తలు
రాజకీయం
SELECT * FROM newsdescription where activity_type='5' order by id desc limit 0,19