اردو میں پڑھیںRead in Englishవందశాతం వ్యాక్సిన్ కై కృషి చేద్దాం : మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి, Siddipet News | ప్రాంతీయం
Download Siddipet News Android App: Click Here

వందశాతం వ్యాక్సిన్ కై కృషి చేద్దాం : మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి

వందశాతం వ్యాక్సిన్ కై కృషి చేద్దాం : మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి

ఈ రోజు మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి గారు పురపాలక సంఘ కార్యాలయంలో వార్డు స్పెషల్ ఆఫీసర్ లు,RP లు, ఆశ వర్కర్ లు , అంగన్వాడీ టీచర్ లతో 100 శాతం వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట పట్టణంలోని 43 వార్డులలో 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు మూడు రోజులలో సర్వే పూర్తి చేయాలని మొత్తం సుమారు 1,10,000 వరకు వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా అందులో 85000 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాగా ఇంకా 25000 మంది వ్యాక్సిన్ వేసుకొనివారు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ఇంకా వ్యాక్సిన్ తీసుకొనివారు వ్యాక్సిన్ తీసుకునేలా చైతన్యపరచాలని ,  సర్వే చేస్తున్న సమయంలో మొదటి డోస్ మరియు రెండవ డోస్ వేసుకున్నవారిని గుర్తించాలని మరియు గౌరవ జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి గారి సూచనలమేరకు అందరు వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ప్రజలను చైతన్య పరచాలని గౌరవ మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి గారు తెలిపారు. రేపటినుండి వ్యాక్సినేషన్ సర్వే మొదలుపెట్టాలన్నారు.  100 శాతం వ్యాక్సిన్ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ పైన అవగాహన కలిగేలా పురపాలక సంఘం నుండి ప్రత్యేక వాహనం లో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా పట్టణంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

ఇట్టి సమావేశంలో  వార్డు స్పెషల్ ఆఫీసర్ లు,RP లు, ఆశ వర్కర్ లు, అంగన్వాడీ టీచర్ లు ,డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు
ప్రాంతీయం
SELECT * FROM newsdescription where activity_type='2' order by id desc limit 0,19