اردو میں پڑھیںRead in Englishఅధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, Siddipet News | జాబ్స్
Download Siddipet News Android App: Click Here

అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సిద్ది పేట, నంగునూరు, కొండపాకల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు ఒప్పంద పద్దతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  సిద్దిపేట బాలికల జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం తెలుగు, ఆంగ్లం మాధ్యమాలు,  రసాయన, అర్థ శాస్త్రాల్లో ఉర్దూ మాధ్యమం, ఆంగ్లం సబ్జెక్టు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ శారద చెప్పారు.

ఈ నెల 22లోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నంగునూరులోని జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపక పోస్టు ఖాళీగా ఉందని ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ బి. కిషన్ తెలిపారు. వివరాలకు 99120 35238 ఫోన్లో సంప్రదించవచ్చన్నారు.

కొండపాక జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధించేందుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ వై.ఇందిరాదేవి పేర్కొన్నారు. ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు
జాబ్స్